- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు
ప్రణాళిక లేని నిర్మాణాలతో భవిష్యత్తులో ముప్పు తప్పదు.

దిశ, అల్వాల్ : అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ శివానగర్‌లో అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా సాగుతున్నాయని తెలిసింది. పర్మిషన్ రెసిడెన్షియల్‌కు తీసుకుని కడుతున్నదేమో కమర్షియల్ నిర్మాణాలు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఆన్‌లైన్ ఫిర్యాదులు చేస్తే స్థానిక అధికారులు ఆ నిర్మాణాల వైపు పోకుండానే ఫిర్యాదులను పరిష్కరించామని రిటన్ ఆన్‌లైన్ క్లీయరెన్స్ ఇచ్చేవారని ఫిర్యాదుదారులు తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ ప్రత్యేక టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏర్పాటు చేసి దానికి తగిన యంత్రాంగాన్ని సమకూర్చింది. ఆ శాఖకు సరిపడ అధికార యంత్రాంగం ఉందా? లేదా? అనేది వేరే విషయం. ఉన్న యంత్రాంగం, అధికారులు సక్రమంగా పనిచేస్తే ఇన్ని అక్రమ నిర్మాణాలు జరిగేవి కావని స్థానికులు వాపోతున్నారు. అక్రమాలను అరికట్టవలసిన అధికారులు అక్రమార్కులకు వంతపాడినట్లు ఉందని, అందుకే అల్వాల్ సర్కిల్‌లోని అక్రమ నిర్మాణాలకు అంతు లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..
వెంకటాపురం డివిజన్ శివానగర్ టెలికంకాలనీ మధ్యలోని సర్వేనంబర్ 391/అ లో అనేక సంవత్సరాలుగా కోర్టు కేసులు, ప్రభుత్వ స్థలం అంటూ పడావుగా ఉండేది. 2004లో వివాదాలన్ని తీరాయి. తహాశీల్ధార్ తమకు డాక్యూమెంట్స్ రిజిస్టర్ చేశారని సదరు నిర్మాణదారులు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉంది. బహిరంగంగా కనిపించే నిర్మాణాన్ని చూస్తే పర్మిషన్‌కు విరుద్దంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ఇట్టే అర్థం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అనేకసార్లు విన్నవించిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పర్మిషన్ ఎంత, అదనపు అంతస్తులు ఎన్ని, అందులో కమర్షియలు, షెట్టర్లు ఎన్ని తదితర విషయాలను టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమం అని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






