సికింద్రాబాద్ లో అక్ర‌మ గ్యాస్ సిలిండ‌ర్ల దందా బ‌ట్ట‌బ‌య‌లు

by Ratna Kumari |

సికింద్రాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల విక్రయం జరుపుతున్న ముఠాను పోలీసులు బట్ట బయలు చేశారు.

సికింద్రాబాద్ లో అక్ర‌మ గ్యాస్ సిలిండ‌ర్ల దందా బ‌ట్ట‌బ‌య‌లు
X

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల విక్రయం జరుపుతున్న ముఠాను పోలీసులు బట్ట బయలు చేశారు. టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ జోన్, గాంధీ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 129 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను (25 నిండినవి, 104 ఖాళీ) స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.7.50 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనంగా అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనం, ఒక ఆక్టివా ద్విచక్ర వాహనం, రూ.26,700 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేశారు.


అరెస్టైన నిందితులు యాలం ప్రతాప్ కుమార్, జల్లెల మల్లేష్ (ఇద్దరూ గ్యాస్ డెలివరీ బాయ్స్), మోరా నాగార్జున అలియాస్ అర్జున్ (మధ్యవర్తి), నాగులపల్లి మల్లేష్ (వినియోగదారుడు) గా గుర్తించారు. పోలీసుల విచారణలో గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్న డెలివరీ బాయ్స్ అక్రమంగా సిలిండర్లను మళ్లించి, మార్కెట్ ధర రూ.3,337 ఉన్న సిలిండర్‌ను రూ.3,500 నుంచి రూ.3,800 మధ్య మధ్యవర్తికి విక్రయిస్తున్నట్లు తేలింది. అనంతరం మధ్యవర్తి వాటిని హోటల్స్, టిఫిన్ సెంటర్లకు రూ.5,000 వరకు అమ్ముతూ అధిక లాభాలు అర్జిస్తున్నట్లు వెల్లడైంది. డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు

Next Story