జూబ్లీహిల్స్ లో హైడ్రా పంజా.. జూబ్లీహిల్స్ లో కూల్చివేతలు..

by Bhanu |   (  Updated:2025-05-23 11:30:23  IST  )

అక్రమ నిర్మాణాలు కూల్చి , ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా , కొన్ని రోజులు విరామం తర్వాత ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా మేడిపల్లి పరిధిలో ఆక్రమణలు కూల్చివేతలు చేశారు.

జూబ్లీహిల్స్ లో హైడ్రా పంజా.. జూబ్లీహిల్స్ లో కూల్చివేతలు..
X

దిశ, జూబ్లీహిల్స్: అక్రమ నిర్మాణాలు కూల్చి, ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా , కొన్ని రోజులు విరామం తర్వాత ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా మేడిపల్లి పరిధిలో ఆక్రమణలు కూల్చివేతలు చేశారు. అదే దూకుడుతో శుక్రవారం ఉదయం 6 గంటల నుండే జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఆక్రమణలను హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. పెద్దమ్మగుడి పక్కన నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. ఉదయం ఆరు గంటల నుంచి కూల్చివేతలు కొనసాగాయి. నాలా పై నిర్మించిన నిర్మాణాలు, షెడ్లను కూల్చివేశారు అధికారులు. స్థానికుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ , పెద్దమ్మగుడి సమీపంలోని నాలా పై నిర్మించిన అక్రమ నిర్మాణాలు, షెడ్లను సర్వే నిర్వహించిన అధికారులు.. నాలా ను ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించారు. దీంతో 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేశారు. సంఘటన స్థలం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైడ్రా ప్రకటించిన వివరాల ప్రకారం…. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41, పెద్దమ్మ గుడికి దగ్గరలోని ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. ఒక యింటిని అద్దెకు తీసుకొని.. ఓనర్ కు తెలియకుండానే యింటి చుట్టూ ఉన్న ప్రభుత్వ, ప్రజావసరాలకోసం ఉద్దేశించిన రోడ్డు, నాలాను ఆక్రమించి హోటళ్లు, హాస్టల్ నడుపుతూ కిరాయిదారుడు నెలకు రూ. 10 లక్షలు అద్దెలు వసూలు చేస్తున్నాడు.

కోర్టులో ఎదురుదెబ్బ తో .. హైడ్రా కు కూల్చివేత పగ్గాలు..

అక్రమ నిర్మాణ కిరాయిదారుడి వ్యవహారంపై హైడ్రాకు స్థానికులు ద్వారా ఫిర్యాదులు చేరాయి. దీనిపై విచారించిన హైడ్రా… గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సదరు కిరాయిదారుడు… కోర్టును ఆశ్రయించాడు. అయితే సదరు వ్యక్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిరాయిదారుడుకి ఆ నిర్మాణాలపై ఎలాంటి హక్కు ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. రోడ్డు, నాలాను ఆక్రమించి ఎలా కడతారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వుతలతో హైడ్రా రంగంలోకి దిగింది. నాలాతో పాటు రోడ్డు ను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శుక్రవారం తొలగించింది. దీంతో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్క్ దారికి లైన్ క్లియర్ అయిందని హైడ్రా వివరించింది.

Next Story