అక్రమ నిర్మాణాల జోరు.. నిబంధనలకు పాతర

by Ramesh Goud |

మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో భవనాల యజమానులు తీసుకున్న అనుమతులు ఒకలా ఉంటే చేపడుతున్న నిర్మాణాలు మరోలా ఉంటున్నాయి.

అక్రమ నిర్మాణాల జోరు.. నిబంధనలకు పాతర
X

దిశ, కూకట్​పల్లి: మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో భవనాల యజమానులు తీసుకున్న అనుమతులు ఒకలా ఉంటే చేపడుతున్న నిర్మాణాలు మరోలా ఉంటున్నాయి. నిబంధనలను బేఖాతరు చేసి నిర్మాణాలు చేపడుతున్న యజమానులపై చర్యలు తీసుకోవలసిన టౌన్​ ప్లానింగ్​ విభాగం అధికారులు మొద్దు నిద్ర వీడక పోవడంతో ప్రభుత్వ ఖజనాకు భారీ గండి పడుతోంది. గ్రేటర్​ హైదారబాద్​ పరిధిలోని అన్ని సర్కిళ్లు ఒక వైపు కూకట్​పల్లి జోన్​ పరిధిలోని మూసాపేట్​ సర్కిల్​ పనితీరు ఒకలా ఉంటుంది. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్​​ డివిజన్​ పరిధిలో ఎవరెన్ని అంతస్థులు నిర్మించుకున్న సర్కిల్​ టౌన్​ ప్లానింగ్​ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరన్న ఆరోపణలున్నాయి. రెండు నెలలుగా బాధ్యతలు చేపట్టిన టౌన్​ ప్లానింగ్​ విభాగం అధికారి తీరుతో సర్కిల్​ జోనల్​ కమిషనర్, డీసీ, ఏసీపీ​లే తలలు పట్టుకునే పరిస్థతి వచ్చిందంటే మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. సర్కిల్​ పరిధిలో తనకు నచ్చిన విధంగా విధులు నిర్వహిస్తూ, మామూళ్లు అందిన అక్రమ నిర్మాణాలకు కొమ్మకాస్తూ జీహెచ్​ఎంసీ ఖజానాకు గండి కొట్టేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేపీహెచ్​బీ డివిజన్​ పరిధిలోని భగత్​సింగ్​ నగర్​ ఫేజ్​2, వసంత్​నగర్​ కాలనీ, సర్దార్ పటేల్​ నగర్​ కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న టౌన్​ ప్లానింగ్​ విభాగం అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.

Next Story