ఈ ఐదుగురు క‌నిపిస్తే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి

by Ratna Kumari |   (  Updated:2026-05-03 13:50:03  IST  )

కరీంనగర్ లో బంగారం దుకాణంలో ఆదివారం దోపీడీకి పాల్పడ్డ దొంగల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. కాల్పులకు తెగపడి దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయాల బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు

ఈ ఐదుగురు క‌నిపిస్తే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వండి
X

దిశ, సిటీక్రైం : కరీంనగర్ లో బంగారం దుకాణంలో ఆదివారం దోపీడీకి పాల్పడ్డ దొంగల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. కాల్పులకు తెగపడి దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు వ్యక్తుల సమాచారం ఇస్తే లక్ష రూపాయాల బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ దోపీడీ దొంగల ఫోటోలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లకు పంపించారు. అలాగే వాటిని వాట్సాప్ లలో పోలీసులు పౌరులకు షేర్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసులు కూడా అప్రమత్తమై దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాచారం ఉంటే డయల్ 100 , కరీనగర్ 2 టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ 8712670762, ఏసీపీ కరీంనగర్ టౌన్ 8712670711, ఎస్బీ కంట్రోల్ కరీంనగర్ 8712670713 తెలపాలని పోలీసులు కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story