సైర‌న్ ల‌తో గంద‌ర‌గోళం చేస్తే.. కేసులు త‌ప్ప‌వు

by Nallavelli.Anjaneyulu |

అర్హత లేకున్నా వాహనాల్లో సైరన్ లు పెట్టుకుని మోగిస్తున్న‌ వారిపై మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు.

సైర‌న్ ల‌తో గంద‌ర‌గోళం చేస్తే.. కేసులు త‌ప్ప‌వు
X

దిశ‌, సిటీ క్రైం : అర్హత లేకున్నా వాహనాల్లో సైరన్ లు పెట్టుకుని మోగిస్తున్న‌ వారిపై మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పోలీసులు దాదాపు 15 మంది కార్ల‌ యజమానుల పై కేసులను నమోదు చేశారు. ఆ సైరన్ లను తొలగించారు. సైరన్ లతో రోడ్ల పై ఇతర వాహనదారులను గందరగోళానికి గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మల్కాజిగిరి ట్రాఫిక్ 1 డీసీపీ రాహూల్ రెడ్డి హెచ్చరించారు. అదే విధంగా ప్రమాదకరమైన సెల్ డ్రైవింగ్ పై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రైవ్ లో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై1055 కేసులను నమోదు చేసి 10 లక్షల రూపాయాల చలాన్ లను జారీ చేశారు. రోడ్డు భద్రత నేపధ్యంలో ఈ డ్రైవ్ లను కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story