ఆ ఆస్పత్రిలో అగ్గి రాజుకుంటే అపార నష్టమే

by Disha Web Desk 15 |
ఆ ఆస్పత్రిలో అగ్గి రాజుకుంటే అపార నష్టమే
X

దిశ, మెహిదీపట్నం : ఏదైనా ఆస్పత్రి నిర్వహిస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ కి సంబంధించి ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలి. అదేవిధంగా ఆస్పత్రి భవనానికి జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం సెట్ బాక్స్ కూడా ఉండాలి. కానీ లంగర్ హౌస్ లోని రెనోవా ఆస్పత్రి నిర్వాహకులు ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులతో అటు స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెట్ బాక్స్ లు ఏవీ..?

లంగర్ హౌస్ లోని రెనోవా ఆసుపత్రి భవనానికి ఏమాత్రం సెట్ బాక్స్ లు లేవు. ఆస్పత్రి మెయిన్ గేటు దక్షిణం వైపు ప్రధాన రహదారి వైపు ఉంది. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఏమైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆసుపత్రి నలువైపులా ఫైరింజన్ వెళ్లేంత చోటు ఉండాలి. కానీ రెనోవా ఆసుపత్రికి అలాంటిది ఏమీ లేవు. ఓవైపు మెయిన్ గేటు ఉంది. మరో రెండువైపులా కనీసం రెండు ఫీట్ల మేరకు కూడా ఖాళీ చోటు లేదు. రెండు వైపులా కూడా పక్క పక్కన వేరే భవనాలు ఉన్నాయి. ఆస్పత్రి నిర్మించే సమయంలో జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం సెట్ బాక్స్ వదలాలి. కానీ ఆస్పత్రి యాజమాన్యం ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా నిర్మించారు.

ప్రమాదం జరిగితే బాధ్యులెవరు..?

ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా లంగర్ హౌస్ లో నడుస్తున్న రెనోవా ఆస్పత్రిలో ఒకవేళ దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే అపార నష్టం సంభవించే అవకాశం ఉంది. ఆస్పత్రి చుట్టూ ఫైర్ ఇంజన్లు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొనడంతో ప్రమాదం జరిగితే నష్టం ఊహించలేనిది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Next Story