అనుమతులు లేని ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకోండి : కలెక్టర్ హరిచందన దాసరి

by Chintha Aamani |

జిల్లాలో అనుమతి లేని ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్యాధికారులను ఆదేశించారు.

అనుమతులు లేని ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకోండి : కలెక్టర్ హరిచందన దాసరి
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : జిల్లాలో అనుమతి లేని ఆస్పత్రులను గుర్తించి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చే ముందు అన్ని డాక్యుమెంట్లను క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం 2010 , రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ 2022 ప్రకారం పరిశీలన చేయాలని సూచించారు. జాయింట్ ఆపరేషన్ లో భాగంగా పోలీస్ అధికారులతో ఎస్ పిహెచ్ ఓ లు అనుమతి లేని ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని అన్నారు. కొన్ని హాస్పిటల్స్ లో ఆయుష్ వైద్యులు అలోపతి వైద్యం అందిస్తున్నారని, అటువంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలోని పర్మినెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ కొరకు 374 ప్రైవేట్ ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోగా అందులో 322 దరఖాస్తులకు ఎస్పీహెచ్ఓ ఆమోదం కై సమర్పించారని, ఆ ఆస్పత్రులలో పోలీసులతో పాటు జాయింట్ టీం అధికారులు మరోసారి పరిశీలన చేసి వారంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో వాడే చెక్ లిస్ట్ ను సమీక్షిస్తూ ముఖ్యంగా వైద్యుల ఆధారాలు, వారిపై లేదా ఆ క్లినిక్ పై నమోదైన కేసుల పై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను కోరారు .ఎస్పీహెచ్ఓ ల తనిఖీ లో భాగంగా రిజిస్టర్ చేయబడిన ఆసుపత్రుల లిస్టును కలెక్టర్ కు సమర్పించగా వాటిపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా విధించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కదిరి వన్ పలని, డీసీపీ డాక్టర్ లావణ్య ,డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వెంకటి, అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్. జయమాలిని, డి ఎం ఓ రాములు, డిప్యూటీ డీఎంఓ అంజయ్య గౌడ్,డి ఐ ఓ డాక్టర్ శ్రీధర్, ఎస్ పి హెచ్ ఓ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story