మూడు రోజులు ఇళ్ళు దాటకండి : హైడ్రా వార్నింగ్

by Muthe.Rajitha |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంతోపాటు హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో అతిభారీ వర్షాలు కురవనున్నట్టు వాతారవరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మూడు రోజులు ఇళ్ళు దాటకండి : హైడ్రా వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంతోపాటు హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో అతిభారీ వర్షాలు కురవనున్నట్టు వాతారవరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు హైడ్రా(HYDRAA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 13, 14, 15 తేదీల్లో నగరంలో అతి భారీ వర్షాలు కురవనున్న క్రమంలో నగర వాసులు ఈ 3 రోజులు ఇళ్ళు దాటకుండా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని అలర్ట్స్ పంపింది. అలాగే విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని, ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ చేసుకోవాలని సూచించింది.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే సురక్షిత ప్రాంతాల్లో షెల్టర్ పొందాలని తెలిపింది. రానున్న 3 రోజులపాటు ఏ క్షణమైనా రంగంలోకి దిగేందుకు మాన్సూన్ ఫోర్స్ సిద్ధంగా ఉందని పేర్కొంది. మేడ్చల్, సైబరాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Next Story