హనుమాన్ గుడి, ముస్లింల చిల్లా సమస్యకు తెర! ఆ ప్రాంత నివాసితులతో హైడ్రా కమిషనర్ సమావేశం

by Ramesh Naini |

మాదాపూర్‌, బోర‌బండ స‌రిహ‌ద్దుల్లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తున్న హనుమాన్ గుడితో పాటు.. ముస్లింల ప్రార్థ‌నా స్థ‌లం చిల్లా త‌ర‌లింపున‌కు అంగీకారం కుదిరినట్లు హైడ్రా తెలిపింది.

హనుమాన్ గుడి, ముస్లింల చిల్లా సమస్యకు తెర! ఆ ప్రాంత నివాసితులతో హైడ్రా కమిషనర్ సమావేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాదాపూర్‌, బోర‌బండ స‌రిహ‌ద్దుల్లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తున్న హనుమాన్ గుడితో పాటు.. ముస్లింల ప్రార్థ‌నా స్థ‌లం చిల్లా త‌ర‌లింపున‌కు అంగీకారం కుదిరినట్లు హైడ్రా తెలిపింది. సున్నం చెరువు ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల‌తో శ‌నివారం హైడ్రా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఇరు ప‌క్షాలకు చెందిన వారు ఇందుకు స‌మ్మ‌తి వ్య‌క్తం చేశారు. హైడ్రా మొద‌టి విడ‌త‌లో పున‌రుద్ధ‌రిస్తున్న ఆరు చెరువుల్లో సున్నం చెరువు కూడా ఉంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో చిన్న ఆంజ‌నేయ‌గుడితో పాటు.. ఆ స‌మీపంలోనే ముస్లింల చిల్లా కూడా ఉంది.

ఇవి ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తున్నందున వీటిని చెరువు గ‌ట్టువైపు త‌ర‌లించాల‌ని హైడ్రా భావించింది. వీటి త‌ర‌లింపున‌కు సంబంధించిన అంశం సామాజిక మాధ్య‌మాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ నేప‌థ్యంలో ఇరు ప‌క్షాల‌కు చెందిన స్థానికుల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం హైడ్రా కార్యాల‌యంలో చ‌ర్చించారు. సుప్రింకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలను వివ‌రించారు. ఆంజ‌నేయ విగ్ర‌హంతో పాటు, చిల్లాను చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో కాకుండా.. చెరువు గ‌ట్టు వైపు త‌ర‌లించే విష‌య‌మై వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ఇరు ప‌క్షాల‌కు చెందిన స్థానికులు అంగీకారం చెప్ప‌డంతో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింది. సున్నంచెరువు చెంత‌.. వాటిని సుర‌క్షితంగా త‌ర‌లించ‌డానికి స్థానికులు అంగీకారం వ్య‌క్తం చేశారు. దీంతో ఈ స‌మ‌స్య‌కు తెరపడింది.

Next Story