AV Ranganath : న్యాయం వైపే హైడ్రా : ఏవీ రంగనాథ్

by Muthe.Rajitha |

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissionor AV Ranganath) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

AV Ranganath : న్యాయం వైపే హైడ్రా : ఏవీ రంగనాథ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissionor AV Ranganath) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. నేడు సంగారెడ్డిలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగనాథ్ పై వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddi District) ఐలాపూర్(Ailapur) కు చెందిన ఓ ఫ్లాట్ అసోసియేషన్ తమ ఫ్లాట్ల కబ్జా గురించి గత వారం హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులతో విచారణ చేయించి.. స్వయంగా రంగనాథ్ ఐలపూర్లో పర్యటించారు. ఫిర్యాదు దారుల స్థలాలను పరిశిలీంచి వారి సమస్యలు విన్నారు. ఈ క్రమంలో హైకోర్టు న్యాయవాది(High Court Advocate) అయిన ముఖీమ్ అక్కడికి చేరుకొని బాదితులను బెదిరించేందుకు ప్రయత్నం చేశారు. కాగా కొద్దిసేపు ఫిర్యాదు దారునికి, న్యాయవాదికి వివాదం జరిగింది. ఇదంతా స్వయంగా సమీక్షించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కొందరు భపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైడ్రా ఎప్పుడూ న్యాయం వైపు, బాధితుల వైపే ఉంటుందని పేర్కొన్నారు. కాగా రెండు వారాల్లో ఈ విషయంపై లోతుగా విచారణ చేస్తామని అన్నారు. ఇరువైపులా వాదనలు వింటామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించి 2 నెలల్లోగా వీరి సమస్యను పరిష్కరిస్తామని రంగనాథ్ తెలియజేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిన హైడ్రా పీఎస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నదని, బాధితులు నేరుగా పీఎస్ లో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ వెల్లడించారు.

Next Story