HYD: వ్యాయామ పరికరాలతో పాతబస్తీ చెరువు.. పండగ తర్వాత ప్రారంభానికి సిద్ధం

by Ramesh Naini |

పాత‌బ‌స్తీలోని బమ్-రుక్న్- ఉద్ - దౌలా చెరువు సర్వాంగ సుందరంగా మారింది. తుది దశకు వచ్చిన అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు.

HYD: వ్యాయామ పరికరాలతో పాతబస్తీ చెరువు.. పండగ తర్వాత ప్రారంభానికి సిద్ధం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాత‌బ‌స్తీలోని బమ్-రుక్న్- ఉద్ - దౌలా చెరువు సర్వాంగ సుందరంగా మారింది. తుది దశకు వచ్చిన అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. దాదాపు రెండు కిలోమీటర్లు ఉండే చెరువు గట్టుపై నడుచుకుంటూ వెళ్తూ పలు సూచనలు చేశారు. స్థానికులతో మాట్లాడి.. వారి సూచనల మేరకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చెరువు చుట్టూ లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. చాలా స్పష్టంగా కనిపించేలా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నందున వారికి అనువైన వ్యాయామ పరికరాలను సమకూర్చాలన్నారు.

చెరువు చరిత్రను చెబుతూ ప్రవేశ మార్గం వద్ద శిలాఫలకం అభివృద్ధి చేయాలన్నారు. ఔషధ గుణాలున్న నీటితో నిజమల కాలంలో అలరారే చెరువు కనుక చెరువు చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్ నాటాలన్నారు. పిల్లలు, పెద్దలు భద్రంగా.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసేలా చెరువు పరిసరాలు తీర్చిదిద్దాలన్నారు. మిగిలిన పనులను పూర్తి చేసి పండగ తర్వాత ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.

Next Story