హైడ్రాకు పేదలు, ధనవంతులనే తేడా లేదు : కమిషనర్ రంగనాథ్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-18 08:51:32  IST  )

హైదరాబాద్ లోని బతుకమ్మకుంటలో హైడ్రా(HYDRA) మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంది.

హైడ్రాకు పేదలు, ధనవంతులనే తేడా లేదు : కమిషనర్ రంగనాథ్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని బతుకమ్మకుంటలో హైడ్రా(HYDRA) మొదటి వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నీటి వనరుల రక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ లక్ష్యంగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ స్థాపించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు అంబర్‌పేటలోని బతుకమ్మకుంట వద్ద వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) మాట్లాడుతూ.. హైడ్రా పేదలు, ధనవంతులు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తుందని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణలు తొలగించడంలో దూకుడుగా వ్యవహరించామని, రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా పనిచేస్తామని పేర్కొన్నారు.

హైడ్రా అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కఠిన చర్యలతో అక్రమార్కులకు భయం కలిగించిందని, నగరంలో నీటి వనరుల రక్షణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువు దాదాపు రూ. 30 వేల కోట్లపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఆరు చెరువులను పునరుద్ధరిస్తున్నామని, వాటి విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెరిగిందని వెల్లడించారు.


Next Story