- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా నిరసనలకు చెక్ పెట్టే ‘స్వాట్’ బృందం సిద్ధం..
హైదరాబాద్‌లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు వంటి కార్యక్రమాల్లో మహిళల నిరసన కారులను ఎదుర్కొనడానికి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

దిశ, సిటీ క్రైమ్ : హైదరాబాద్‌లో ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు వంటి కార్యక్రమాల్లో మహిళల నిరసన కారులను ఎదుర్కొనడానికి, ప్రత్యేకంగా మహిళా పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందాన్ని "స్వాట్" అంటే స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ అనే పేరుతో ప్రారంభించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ బృందం, ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ టీం పండుగలు, బహిరంగ సభలు, సమావేశాలలో మహిళల భద్రత కోసం పని చేస్తుందని అధికారులు తెలిపారు. స్వాట్ టీంకు 2 నెలల పాటు ప్రత్యేక శిక్షణను అందించారు. ఈ టీంలో మొత్తం 35 మంది మహిళ పోలీసు అధికారులు ఉంటారని అధికారులు వివరించారు. వీరికి ప్రత్యేకంగా మహిళ నిరసనకారులను ఏలా ఎదురుకోవాలనే అంశాల పై కార్వ మాగా, ఆయుధాలు లేకుండా కొన్ని చిట్కాలతో మహిళ నిరసనకారులు, ఆందోళనకారులను అడ్డుకునే అంశాల పై మెలుకువలను నేర్పించారు.
జూలై 4వ తేది నుంచి ఈ స్వాట్ టీం పోలీసులు సచివాలయం వద్ద బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను ఏర్పాటు చేశారు. ఈ స్వాట్ టీం రావడంతో నిరసనల సమయంలో పోలీసు అధికారులు మహిళలతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలకు చెక్ పడుతుందని స్పష్టం అవుతుంది.






