- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hyderabad : ఓల్డ్ మలక్‌పేట్ వద్ద పొంగిన మురుగు నీరు.. 10 గంటలకు పైగా కొనసాగుతున్న భారీ ట్రాఫిక్ జామ్
హైదరాబాద్(Hyderabad)లోని ఓల్డ్ మలక్‌పేట్(Old Malakpet) వద్ద మురుగు నీరు పొంగడంతో చాదర్‌ఘాట్- మలక్‌పేట్ రోడ్డులో ఇరువైపులా 10 గంటలకు పైగా భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని ఓల్డ్ మలక్‌పేట్(Old Malakpet) వద్ద మురుగు నీరు పొంగడంతో చాదర్‌ఘాట్- మలక్‌పేట్ రోడ్డులో ఇరువైపులా 10 గంటలకు పైగా భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. అక్బర్ ప్లాజా(Akbar plaza), ఓల్డ్ మలక్‌పేట్ వద్ద శుక్రవారం ఉదయం నుంచి మురుగు నీరు పొంగి(Sewage Water leakage) రోడ్డును ముంచెత్తింది. మురుగు నీటి లీకేజీ మరమ్మత్తుల పనులను HMWS & SB చేపట్టినప్పటికీ.. మురుగు నీటి ప్రవాహాన్ని కట్టడి చేయలేక చేతులెత్తేశారు అధికారులు. దీంతో ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు నరకం చూశారు. కోఠి నుంచి మలక్‌పేట్ మధ్య గల కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా అయిందో ఊహించవచ్చు.
చర్యలు చేపట్టవల్సిన GHMC అధికారులు గాని, హైడ్రా అధికారులు గాని పత్తా లేకుండా పోయారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు కూడా ఏమీ చేయలేక.. మరమ్మతు పనుల వల్ల చాదర్‌ఘాట్ నుంచి నల్గొండ X రోడ్స్ వరకు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోందని ఓ పోస్ట్ పెట్టి చేతులు దులుపుకుంది. పైగా ఆ దారిలో గల ప్రధాన బ్రిడ్జ్ ను కూడా మూసివేయడంతో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు శుక్రవారం ఉదయం నుంచి చుక్కలు చూశారు.
ఉదయం నుంచి సమస్య తీవ్రత తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై నగర పౌరులు దుమ్మెత్తి పోస్తున్నారు. కోఠి నుంచి మలక్‌పేట్ మార్గంలో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలి అని 'దిశ' రిపోర్టర్స్ సమాచారం. చాదర్‌ఘాట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే వారు చాదర్‌ఘాట్, నింబోలియడ్డా, గోల్నాకా, న్యూ బ్రిడ్జ్ గోల్నాకా, మూసారామ్ బ్రిడ్జ్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవాలని సూచిస్తున్నారు.






