- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Police Dance: డాన్స్ ఇరగదీసిన హైదరాబాద్ ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రంలోని గీతానికి హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి చెందిన పోలీసులు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రంలోని గీతానికి హైదరాబాద్ ఓల్డ్‌సిటీకి చెందిన పోలీసులు చేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విధుల్లో ఉన్న ఒత్తిడిలోనూ కాసేపు సరదాగా గడుపుతూ పోలీసు సిబ్బంది వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
వీడియోలో పలువురు కానిస్టేబుళ్లు, ఎస్సై కలిసి సింగిల్ టేక్‌లో డాన్స్ చేస్తూ కనిపించారు. వారి ఎనర్జీ, కుదిరిన సింక్ వీడియోను హైలైట్ చేశాయి. అనూహ్యంగా కనిపించిన ఈ డాన్స్ స్టంట్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సర్వీస్ ప్రెషర్ మధ్యలో కూడా ప్రజలకు సాన్నిహితంగా, రిలాక్స్‌గా ఉండే పోలీసులను చూసి చాలా మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు. డ్యాన్స్ ఇరగదీశారని నెటిజన్‌లు వీడియో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వీడియోకు వేలాది షేర్లు, లైకులు సొంతం చేసుకుంటూ వైరల్‌గా మారింది. వీడియో ఇదే..






