దోమల మాయ.. మస్కిటో కాయిల్ తిప్పిన భయంకర కథ..!

by Bhanu |

దోమల నివారణకు ఇంట్లో వెలిగించిన మస్కిటో కాయిల్ ఓ బాలుడి ప్రాణం తీసింది.

దోమల మాయ.. మస్కిటో కాయిల్ తిప్పిన భయంకర కథ..!
X

దిశ, వనస్థలిపురం: దోమల నివారణకు ఇంట్లో వెలిగించిన మస్కిటో కాయిల్ ఓ బాలుడి ప్రాణం తీసింది. హయత్​నగర్​సీఐ నాగరాజుగౌడ్​ వివరాల ప్రకారం.. పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని భువనేశ్వరి కాలనీలో అబ్దుల్ ఖాదర్ జిలానీ భార్య, నలుగురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం రాత్రి సమయంలో దోమల నివారణకు మస్కిటో కాయిల్ వెలిగించాడు. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో కాయిల్ పరుపుపై పడడంతో నిప్పంటుకుని, గది మొత్తం పొగతో నిండింది. ఈ ప్రమాదంలో పరుపుపై పడుకున్న బాలుడు అబ్దుల్ రెహమాన్ (4) ఊపిరాడక మృతిచెందాడు. బాలిక ఆతిఫా(4) తీవ్రంగా గాయపడడంతో నీలోఫర్ దవాఖానకు తరలించారు.

అబ్దుల్ ఖాదర్ కు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు మొత్తం నలుగురు పిల్లలు కాగా.. పెద్ద కొడుకు అర్హన్, పెద్ద కూతురు ఆఫియా హాల్ లో పడుకున్నారు. జిలానీ, భార్య ఫౌజియ బేగం, చిన్న కుమారుడు అబ్దుల్ రెహమాన్, చిన్న కుమార్తె ఆతిఫా నలుగురు బెడ్ రూమ్ లో పడుకున్నారు. సమాచారం తెలుసుకున్న హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story