అంబులెన్సులు వచ్చాయి.. ఆక్సిజన్ ఉంది : సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్

by Bhanu |

పాత బస్తి గుల్జార్ హౌస్ లో ఈ నెల 18వ తేదీన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ లు రాక బాధితులకు ఆక్సిజన్ అందలేదనేది కొన్ని పత్రికలలో వచ్చిన వార్త లు అవాస్తవమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.

అంబులెన్సులు వచ్చాయి.. ఆక్సిజన్ ఉంది : సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : పాత బస్తి గుల్జార్ హౌస్ లో ఈ నెల 18వ తేదీన అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ లు రాక బాధితులకు ఆక్సిజన్ అందలేదనేది కొన్ని పత్రికలలో వచ్చిన వార్త లు అవాస్తవమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన 15 మంది బాధితులను 7అంబులెన్సులు108 వాహనములలో సమీప ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులను తక్షణమే తరలించారని, ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు అందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రమాద సమాచారాన్ని 108 జిల్లా కోఆర్డినేటర్ భూమా నాగేందర్ కు తెలియజేయడం జరిగిందన్నారు.

ప్రమాదానికి సంబంధించిన సమాచారము ఉదయం 6.17 నిమిషాలకు 108 కాల్ సెంటర్ కు అందిన వెంటనే గోషామహల్ 108 అంబులెన్స్ TS 08 UL 5682 వాహనము సిబ్బందితో ఉదయం 6.25 నిమిషాలకు(8 నిమిషాలలో) ప్రమాద స్థలానికి చేరి సహాయ చర్యలు అందించడం జరిగిందన్నారు. తదుపరి అగ్ని ప్రమాద తీవ్రతను గుర్తించి తిరిగి (06) 108 అంబులెన్స్ వాహనాలు TG 09UB 9280, TG 08 T 8252,TG 08 T 7933,TG 08 T 7274, TG 08T 8202,TG 08T 8113 అగ్ని ప్రమాద స్థలానికి వెంటనే చేరుకుని సహాయ చర్యలు అందించాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు సోమవారం ఏడు108 అంబులెన్స్ వాహనాలను ఆకస్మికంగా పరిశీలించగా అందులో అవసరమైన ఆక్సిజన్ వసతులు, నిలువలు ఉన్నట్లు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు ధ్రువీకరించినారని కలెక్టర్ తెలిపారు.

Next Story