ఆదర్శ దంపతులు.. ఫేక్ సేల్ డీడ్స్ తో భూములకు ఎసరు.. పరేషాన్ లో ఓనర్ లు...

by Bhanu |

హైదరాబాద్ లో నకిలీ సేల్ డీడ్ లను తయారు చేసి భూ వివాదాలను స్రుష్టిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

ఆదర్శ దంపతులు.. ఫేక్ సేల్ డీడ్స్ తో భూములకు ఎసరు.. పరేషాన్ లో ఓనర్ లు...
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ లో నకిలీ సేల్ డీడ్ లను తయారు చేసి భూ వివాదాలను స్రుష్టిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మొదటి సారి వెలుగులోకి వచ్చిన ఈ తరహా మోసం కలకం రేపుతుంది. తండ్రి కోడుకులు కలిసి చేసిన ఈ మోసంతో ఏకంగా 280 నకిలీ సేల్ డీడ్ లను రూపొందించారు. ఈ సేల్ డీడ్ లతో అనేక భూ వివాదాలను భూ కబ్జాదారులు, మోసగాళ్లు స్రుష్టించారని తెలుస్తోంది. ఈ నకిలీ సేల్ డీడ్ లతో ఏకంగా కోర్టులలో కూడా వాటిని దాఖలు చేసి భూవివాదాలను పరిష్కారం కాకుండా వాటిని పొడిగించారని తెలుస్తోంది. ఈ ముఠా ఫేక్ సేల్ డీడ్స్ తో పాటు నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ లు, ఇన్ కమ్ సర్టిఫికేట్స్ , కుల ధ్రువీకరణ పత్రాలను సైతం తయారు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా లో మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించిన రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా అక్రమ దందా గురించి రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు , ఎస్ఓటీ అధికారులతో ఎల్బీనగర్ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో వెల్లడించిన వివరాల ప్రకారం....హాయత్ నగర్ కుంట్లూర్ ప్రాంతానికి చెందిన తోట వెంకట భాను ప్రకాష్, సాగరికలు భార్యభర్తలు.సరూర్ నగర్ మున్సిపాల్టీ కార్యాలయం ఎదురుగా వీరు సాత్విక్ ఎంటర్ ప్రైజస్ తో నోటరీ బిజినెస్ ను నిర్వహిస్తున్నాడు. పాత బస్తీకి చెందిన సయ్యద్ ఫిరోజ్ అలీ, తండ్రి కొడుకులైన అడ్డగురు చంద్రశేఖర్, అనిల్, మహ్మద్ జలీల్, అండర్ పేట్ కు చెందిన పులుసు మల్లేష్ గౌడ్ , కామారెడ్డి కి చెందిన ప్రవీణ్, నార్సింగి ప్రాంతానికి చెందిన దుడ్డు సుధీర్ కుమార్, బండ్లగూడ జాగీర్ కు చెందిన ముద్దసర్, చౌటుప్పల్ కు చెందిన జల్లా కిషోర్ కుమార్, ఖమ్మం కు చెందిన చంచల నాయక్, దిల్ సుఖ్ నగర్ కు చెందిన సత్య ప్రభు లతో ఒక ముఠాను ఏర్పాటు చేశారు. ఇలా తోట వెంకట భాను ప్రకాష్, సాగరికలు దాదాపు 280 ఫేక్ సేల్ డీడ్ లను తయారు చేశారు. ఒక ఫేక్ సేల్ డీడ్ ను రూ. 50 వేల నుంచి 3 లక్షల వరకు తయారు చేసి అమ్మే శారు. ఒక బర్త్ సర్టిఫికేట్ ను రూ.20 వేల రూపొందించి అమ్మేశారని పోలీసు దర్యాప్తులో తేలింది. పట్టుబడ్డ తోట వెంకట భాను ప్రకాష్, సాగరిక, తండ్రి కొడుకులైన అడ్డగుడురు చంద్రశేఖర్, అనిల్, మహ్మద్ జలీల్, జల్లా కిషోర్ కుమార్ లను అరెస్టు చేసి మొత్తం పాత జుడిషీయల్ బాండ్ పేపర్స్ తో లైసెన్స్ వెండర్ సంతకాలు లేని బాండ్ పేపర్ లు మొత్తం 571 బాండ్ పేపర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 48 నకిలీ బర్త్ సర్టిఫికేట్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫేక్ సేల్ డీడ్ బాగోతం బయటపడింది ఇలా

చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన జల్లా కిషోర్ కుమార్ కు స్థానికంగా ఓ ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ను 2021 సంవత్సరంలో ఓ ఫైనాన్స్ కంపెని కి ఒరిజినల్ సేల్ డీడ్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి అదే ప్లాట్ కు నకిలీ సేల్ డీడ్ ను తయారు చేసి దానిని తిరిగి అమ్మేందుకు స్కెచ్ వేశాడు. దీని కోసం కిషోర్ కుమార్ సాత్విక్ ఎంటర్ ప్రైజస్ నిర్వహిస్తున్న తోట వెంకట భాను ప్రకాష్ , సాగరికలను సంప్రదించాడు. ఈ ఇద్దరు పాత బస్తీ లో డాక్యుమెంట్ రైటర్ అయిన ఫిరోజ్ అలీని సంప్రదించాడు. అతను పాత నాన్ జుడిషీయల్ స్టాంప్ పేపర్స్ ను ఇచ్చాడు. ఆ స్టాంప్ పేపర్స్ పై 2020 సంవత్సరంలో కిషోర్ కుమార్ పేరు మీద అతని ప్లాట్ తో పాటు పక్కన ప్లాట్ నెంబరును కలిపి సేల్ డీడ్ ను తయారు చేశారు. ఈ పాత స్టాం పేపర్ ల పై 2020 లో చౌటుప్పల్ రిజిస్టర్ గా ఎవరు ఉన్నారు, అప్పటి స్టాంప్ లు, సంతకాలను అచ్చంగా దించేశారు. అలా ఫేక్ సేల్ డీడ్ ను తయారు చేసి కిషోర్ కుమార్ కు ఇచ్చారు. ఈ సేల్ డీడ్ తో కిషోర్ కుమార్ మరోసారి ఆ ప్లాట్ పై వివాడం స్రుష్టించి తిరిగి ఈ పత్రాలతో భారీగా రుణంలో పొందాలని ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్ పెక్టర్ వెంకటయ్య బ్రుందం తోట వెంకట భాను ప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం గుట్టు బయటపడింది. ఈ విచారణలో 25 ఏండ్ల కిందట రిజిస్టర్ అయిన సేల్ డీడ్ లను తయారు చేసేందుకు 11 స్టాంప్ పేపర్ లను రెడీ గా ఈ ముఠా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

బాండ్ పేపర్ ల విక్రయం పై నిబంధనలు ఉన్నా బేఖాతర్

తోట వెంకట భాను ప్రకాష్, సాగరికలు గత 9 ఏండ్లుగా సాత్విక్ ఎంటర్ ప్రైజస్ ను నిర్వహిస్తు రెంటల్ అగ్రిమెంట్ లు, నోటరీ పేపర్ లను విక్రయాలను జరుపుతున్నారు. మొదట చట్టబద్ధంగా చేసినప్పటికి డబ్బుకు ఆశ పడి పాత బస్తీకి చెందిన ఫిరోజ్ అలీ నుంచి పాత బాండ్ పేపర్ లను కొనుగొలు చేశారు. లైసెన్స్ స్టాంప్ వెండర్ లైన అడ్డగుడురు చంద్రశేఖర్, అనిల్ ల నుంచి బాండ్ పేపర్ లను వెండర్ స్టాంప్ లు లేకుండా ఖాళీ వాటిని వందల్లో కొనుగొలు చేశారు. ఆ తర్వాత ఫేక్ సేల్ డీడ్ లు, రెంటల్ అగ్రిమెంట్ లు తయారీ సమయంలో ఈ ఖాలీ బాండ్ పేపర్ లపై ఫేక్ లైసెన్స్ వెండర్ స్టాంప్ వేసి నకిలీ ప్రతాలను తయారు చేశారు. ఇలా నకిలీ సేల్ డీడ్ లు, రెంటల్ అగ్రిమెంట్ లను తయారు చేసుకున్న భూ కబ్జాదారులు, మోసగాళ్ళ నుంచి 50 వేల నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి నకిలీ బర్త్ సర్టిఫికేట్ దందా

తోట వెంకట భాను ప్రకాష్, సాగరికలు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం, నార్సింగి మున్సిపల్ కార్యాలయం, బండ్లగూడ మున్సిపల్ కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులైన ప్రవీణ్, దుద్దు సుధీర్ కుమార్, ముద్దసిర్ లతో కలిసి నకిలీ బర్త్ సర్టిఫికేట్ లు, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ , ఇన్ కమ్ సర్టిఫికేట్ లను ఏలాంటి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోయిన ఒక సర్టిఫికేట్ కు 20 వేల రూపాయాలను తీసుకుని అక్రమార్కులకు అందిస్తున్నారని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ ముఠా అక్రమ దందా అసాంఘిక శక్తుల కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ఉందని పోలీసుల దర్యాప్తలో వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా నుంచి తీసుకున్న 280 ఫేక్ సేల్ డీడ్స్ యజమానులను పోలీసులు గుర్తించే పనుల్లో ఉన్నారు. అదే విధంగా ఫేక్ బర్త్ సర్టిఫికేట్ లను పొందిన వారిని కూడా గుర్తించి పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.


Next Story