Guinness Book of World Records : గిన్నిస్ బుక్ రికార్డ్స్ కు ఎక్కిన హైదరాబాద్‌ బేకింగ్ కంపెనీ

by M.Rajitha |
Guinness Book of World Records : గిన్నిస్ బుక్ రికార్డ్స్ కు ఎక్కిన హైదరాబాద్‌ బేకింగ్ కంపెనీ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన బేకింగ్ కంపెనీ అరుదైన ఘనత సాధించింది. హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్(Harley's India Fine Baking) సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద కేక్‌ను తయారుచేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Records) లో స్థానాన్ని సంపాదించింది. రూపొందించింది. వాస్తవానికి 3 టన్నుల కేక్ తయారు చేయాలని భావించినా, చివరకు 2,254 కేజీలను తయారు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధుల ముందే 500 మంది బేకర్లు, చెఫ్‌లు కలిసి ఈ అద్భుతాన్ని సాధించారు. న్యాయనిర్ణేతలుగా ఉన్న రిషి నాథ్, నిఖిల్‌ శుక్లాలు.. గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్‌ను హార్లీస్‌ ఇండియా అధినేత సురేష్ నాయక్‌‌కు అందజేశారు. సినీ దర్శకుడు చందు మొండేటి, చిన్ని కృష్ణ, హీరో భరత్ రెడ్డి సహా పలువురు ఈ ఈవెంట్ లో పాల్గొని సురేష్ నాయక్ ను అభినందించారు. కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్ సెంటర్‌లో రష్యన్ మెడోవిక్‌ హనీ(Russian Medovic Honey cake) అనే.. 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు గల భారీ కేక్‌ రూపొందించారు.

Advertisement

Next Story

Most Viewed