- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాదర్‌ఘాట్ వైపు వెళ్తున్నారా? అయితే గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం ఖాయం
మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కూడా తుఫాను బారిన పడింది. నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, భారీగా నీళ్లు చేరి రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే చాదర్‌ఘాట్ కేర్ హాస్పిటల్ నుండి శివాజీ బ్రిడ్జ్ (చాదర్‌ఘాట్ బ్రిడ్జ్) వరకు గల 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలతో నిండిపోవడంతో, వాహనాల రాకపోకలు నత్తనడకన సాగుతున్నాయి. RTC బస్సులు, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలు కూడా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. కాగా ఆయా మార్గాల్లో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.






