HYDలో భారీగా పెరిగిన ఇంటి అద్దె.. ఏ ప్రాంతంలో ఎంత రేట్ అంటే?

by Dishanational2 |
HYDలో భారీగా పెరిగిన ఇంటి అద్దె.. ఏ ప్రాంతంలో ఎంత రేట్ అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ :హైదరాబాద్‌లో మంచి ఇళ్లు చూసుకొని రెంట్‌కు ఉందాం అనుకుంటున్నారా.. అమ్మాయిలు, అబ్బాయిలు చదువుల కోసం బాగ్యనగరం వచ్చి, రూమ్‌లో ఉందామని నిర్ణయించుకుంటున్నారా.. అయితే మీకోసమే ఈ ముఖ్యమైన సమాచారం.

ఎక్కడెక్కడి ప్రాంతాల నుంచో ఉపాధి కోసం చాలా మంది హైదరాబాద్ వస్తూ ఉంటారు. ఇంటిని అద్దెలకు తీసుకొని ఉంటుంటారు. కాగా, ప్రస్తుతం భాగ్యనగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా 2బీ హెచ్‌కే 1000 చదరపు అడుగుల ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కాబట్టి ఏఏ ప్రాంతాలలో ఎంత రెంట్ పెరిగిందో ఇప్పుడు చూద్దాం.

అనరాక్ రీసెర్చ్ ప్రకారం.. హైటెక్ సిటీలో 2022 క్యూ1లో ఇంటి అద్దె రూ.24 వేలుగా ఉండేది. అయితే ఇప్పుడు,26,800లకు చేరింది అంటే 11 శాతం పెరిగింది. ఇక ఈ రెంట్ అనేది 2 బీహెచ్‌‌కే 1000 చదరపు ఇంటికి వర్తిస్తుంది.

అలాగే గచ్చి బౌలీలో 2022లో ఇంటి అద్దె దాదాపు రూ.23వేలుగా ఉండగా, ప్రస్తుతం25,600లకు చేరింది. అంటే 12 శాతం పెరిగింది.1000 చదరపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఇది వర్తిస్తుంది.

ఇక కొండాపూర్‌లో 2022లో ఇంటి అద్దె 21,500గా ఉండగా, ప్రస్తుతం 24000లకు పెరిగింది. అంటే 12శాతం పెరిగింది. 2 బీహెచ్‌కేకు ఇది వర్తిస్తుంది. అంతే కాకుండా హైదరాబాద్‌లోని వివిధ ప్రైమ్ లోకేషన్లలోని ఇళ్ల అద్ద రేట్లు విపరీతంగా పెరిగాయి.కానీ ఇంటి అమ్మకం రేట్లు మాత్రం 30 శాతం పడిపోయినట్లుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed