భవనం పైనుండి దూకి గృహిణి ఆత్మహత్య

by Bhanu |

మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ గృహిణి తాను ఉంటున్న భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం

భవనం పైనుండి దూకి గృహిణి ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ గృహిణి తాను ఉంటున్న భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము గ్రామానికి చెందిన బురద ప్రసాద్ తన భార్య పాలకొండ కుమారి (33) ఇద్దరు పిల్లలతో కలిసి చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆరంబ్ టౌన్ షిప్ లో నివాసం ఉంటున్నాడు.

పాలకొండ కుమారి గత కొంత కాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. గత మూడు సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తాను ఉంటున్న భవనంపై నుంచి దూకింది. దీంతో కుమారికి తీవ్ర గాయాలు అవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న చందానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మానసిక ఆరోగ్యమే కుమారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కుమారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Next Story