- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శంషాబాద్ పట్టణంలో దర్జాగా దందా
పట్టణంలోని కొన్ని హోటల్స్ యా జమాన్యాలు దర్జాగా జీఎస్టీ దందాకు పాల్పడుతున్నాయి.

జీఎస్టీ ఎగ్గొడుతున్న హోటళ్లు!
l వినియోగదారుల నుంచి వసూలు
l స్వాహా చేస్తున్న యాజమాన్యాలు
l కంప్యూటరైజ్డ్ బిల్స్ కాకుండా
చేతితో రాసి ఇస్తున్న వైనం
l పట్టించుకోని జీఎస్టీ అధికారులు
l శంషాబాద్ పట్టణంలో దర్జాగా దందా
దిశ, శంషాబాద్ : పట్టణంలోని కొన్ని హోటల్స్ యా జమాన్యాలు దర్జాగా జీఎస్టీ దందాకు పాల్పడుతున్నాయి. విధిగా వినియోగదారుడి నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్న యాజమాన్యాలు ప్రభుత్వానికి చెల్లించకుండా తమ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తతంగం అంతా చాలా రోజులుగా నడుస్తున్న జీఎస్టీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దర్జాగా నడుస్తున్న దందా..
శంషాబాద్ పట్టణంలోని కొన్ని హోటల్స్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జీఎస్టీ (వస్తు సేవల పన్ను)ను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నా దానిని ప్రభుత్వానికి చెల్లించడం లేదని తెలిసింది. కంప్యూటర్ బిల్స్ ఇ వ్వాల్సి ఉన్న ఆ విధంగా వ్యవహరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులను పెన్నుతో రాసిస్తున్నారని వినియోగదారులు పేర్కొంటున్నారు. అందులో జీఎస్టీ కలిపి ఇస్తున్నారని, కానీ ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి.
కస్టమర్ అవాక్కు..
రెండు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగి శంషా బాద్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఎస్ బవార్చి హోటల్‌కు మధ్యాహ్నం సమయంలో భో జనం చేయడానికి వెళ్లాడు. భోజనం అనంతరం బిల్లు రిసెప్షనిస్ట్ పెన్నుతో రాసి ఇచ్చాడు. కంప్యూ టర్ బిల్లు ఇవ్వాల్సి ఉండగా అలా చేయలేదు. పె న్నుతో రాసి ఇచ్చిన బిల్లులో జీఎస్టీ కూడా ఉంది. ఇదేమని ప్రశ్నించిన వినియోగదారుడికి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. శంషాబాద్ ప ట్టణంలోని చాలా హోటల్లో ఇదే తంతు జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
దృష్టిసారించని యంత్రాంగం..
చాలా హోటల్లు జీఎస్టీ బిల్లులను ఎగ్గొడుతున్న జీఎస్టీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖ అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారమంతా జరుగుతోందని ఆరోపణలు లేకపోలేదు. అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా డబ్బులను జేబుల్లో వేసుకుంటు న్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చే స్తున్నారు.






