- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్టు ఆదేశాలతో రాత్రికి రాత్రే హాస్టల్ ఖాళీ.. రోడ్డున పడిన శ్రామిక మహిళలు

కోర్టు ఆదేశాలతో రాత్రికి రాత్రే హాస్టల్ ఖాళీ.. రోడ్డున పడ్డ వర్కింగ్ ఉమెన్స్
దిశ, శేరిలింగంపల్లి : హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, గచ్చిబౌలి పోలీసుల అత్యుత్సాహం తో వర్కింగ్ ఉమెన్స్ రోడ్డున పడ్డారు. గచ్చిబౌలి వినాయక నగర్ లోని నెక్స్ట్ జెన్ గ్రూప్ ఆఫ్ హాస్టల్స్ పేరుతో హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హాస్టల్ నిర్వాహకులకు, అపార్ట్మెంట్ యజమానికి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. కరోనా కాలంలో సగం అద్దె మాత్రమే చెల్లించిన హాస్టల్ నిర్వాహకులపై.. మొత్తం అద్దె చెల్లించాలని యజమాని ఒత్తిడి చేశాడు. దీనిపై అటు హాస్టల్ నిర్వాహకులు, ఇటు అపార్ట్మెంట్ యజమానులు కోర్టుకు వెళ్లారు. అయితే హాస్టల్ నిర్వాహకులు వెంటనే అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ గచ్చిబౌలి పోలీసులు గురువారం సాయంత్రం హాస్టల్ వద్దకు చేరుకుని అపార్ట్మెంట్ లోని మొత్తం 22 ఫ్లాట్లలో 9 ఫ్లాట్లు వెంటనే ఖాళీ చేయాలని గచ్చిబౌలి పోలీసులు సూచించారు. ఈ 9 ఫ్లాట్లలో 80 మందికి పైగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉంటున్నారు. పోలీసులు ఉన్నపళంగా ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని నెక్స్ట్ జెన్ హాస్టల్‌లో నివసిస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా హాస్టల్ కానీ వసతులు కానీ చూపించకుండా నెక్స్ట్ జెన్ గ్రూప్ హాస్టల్ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని, తమ వద్ద ఫీజులు తీసుకుని ఇప్పుడు రోడ్డున పడేలా చేశారని వర్కింగ్ ఉమెన్స్ ఆందోళనకు దిగారు. కనీసం మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని వర్కింగ్ ఉమెన్స్ కన్నీరు పెట్టుకున్నారు. తమకు కొంత సమయం ఇస్తే వెళ్ళిపోతామని వర్కింగ్ ఉమెన్స్ పోలీసులను ప్రాధేయపడ్డారు.






