హోంగార్డే....బినామీ..

by Taduka Kalyani |

పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా చేరి డీఎస్పీ వరకు ఎదిగిన భీంరెడ్డి ఆస్తుల చిట్టా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

హోంగార్డే....బినామీ..
X

దిశ, సిటీక్రైం : పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా చేరి డీఎస్పీ వరకు ఎదిగిన భీంరెడ్డి ఆస్తుల చిట్టా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఆస్తుల చిట్టా ఆయనే స్వయంగా తన రైటింగ్ తోనే డైరీలో రాసుకోవడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఈ డైరీ లో ఉన్న అన్ని ఆస్తుల చిట్టా కు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఎస్పీ భీంరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఓ హోంగార్డు పై ఆయన కోట్లాది ఆస్తులను పెట్టాడని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. హోంగార్డు తో పాటు ఇంకా నలుగురు బినామీలు భీంరెడ్డికి ఉన్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అంతే కాకుండా భీంరెడ్డి తన ఆస్తులు వారి కుటుంబంలో ఎవరెవరికి చెందాలని కూడా స్పష్టంగా రాసుకున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. భీంరెడ్డి ఆస్తుల పై ఇంకా మూడు నుంచి నాలుగు రోజుల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నాయి. భీంరెడ్డి తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నాయని తెలపడంతో అతని అరెస్టు కు ఏసీబీ అధికారులు వెనుకంజ వేశారని సమాచారం. తాను దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని పోలీసు బాసులకు విజ్ణప్తి చేయడంతో నోటీసులు ఇచ్చి తదుపరి దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలంటున్నాయి.

Next Story