- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్
ఒక అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, హిమాయత్ నగర్ : ఒక అపార్ట్మెంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాయత్ నగర్ లోని ఆశ్రయ్ మ్యాన్షన్ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో బుధవారం రాత్రి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటేష్, టాస్క్ఫోర్స్ ఎస్సై కరుణాకర్ రెడ్డి, సిబ్బంది ప్లాట్ పై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు నాగేశ్వర్ రెడ్డి, సి. ప్రభావతిలను అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు వేల నగదు, ఆరు కండోమ్స్, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ యూ. చంద్రశేఖర్ తెలిపారు. కాగా ఆ నిందితులిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తరలించామని పేర్కొన్నారు. ఇద్దరు మహిళలని కోర్టు ముందు హాజరు పరిచి ప్రజ్వల హోం కు తరలించామని, ఇంతకుముందు నిందితుడు సంగటి నాగేశ్వర్ రెడ్డి పంజాగుట్ట, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లలో వ్యభిచార నేరంలో అరెస్ట్ అయి, కోర్టు కేసులు రిజిస్టర్ అయ్యాయని ఇన్స్పెక్టర్ యూ. చంద్రశేఖర్ వెల్లడించారు.






