- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలో హత్య కలకలం: లిఫ్ట్‌లో మృతదేహం
హైదరాబాద్ హిమాయత్‌నగర్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,రాంనగర్ : హైదరాబాద్ హిమాయత్‌నగర్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్‌నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్‌లో వదిలి పరారయ్యారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి, పోలీసులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మృతుడి వివరాలు, హంతకుడి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు.
Next Story






