High Court : తెలంగాణ IAMC కి భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్ట్

by Muthe.Rajitha |

తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(IAMC) కి హైకోర్ట్(High Court) షాకిచ్చింది.

High Court : తెలంగాణ IAMC కి భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్(IAMC) కి హైకోర్ట్(High Court) షాకిచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్(Hyderabad) లోని రాయదుర్గ్ లో IAMC కేంద్రాన్ని అప్పటి సీఎం కేసీఆర్(Former CM KCR) అట్టహాసంగా ప్రారంభిస్తూ.. సదరు న్యాయసేవా సంస్థకు రాయదుర్గ్ లో మూడున్నర ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే రూ.350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ, వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్ట్ పిటిషన్ దారుల వాదనతో ఏకీభవించి, IAMCకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Next Story