Hyderabad : ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ... భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha) సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌(Heavy Traffic Jam) ఏర్పడింది.

Hyderabad : ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సభ... భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha) సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌(Heavy Traffic Jam) ఏర్పడింది. ఈ సమావేశానికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు హాజరుకాగా, సభ ముగిసిన అనంతరం తిరిగి వెళ్ళే మార్గాలన్నీ భారీగా వాహనాలతో నిండిపోయాయి. ఈ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, రవీంద్రభారతి మార్గాలతో సహా పలు కీలక రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

దీని వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సచివాలయం పరిసరాలలో, ముఖ్యంగా ఇందిరా పార్క్ నుంచి లక్డీకాపూల్ వైపు వెళ్లే మార్గంలో ఉదయం నుంచి భారీ రద్దీ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా సాయంత్రం 2 నుంచి 8 గంటల వరకు ఓల్డ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, విశ్వేశ్వరయ్య స్టాచ్యూ, మాసబ్‌ట్యాంక్ జంక్షన్, రవీంద్రభారతి, తెలుగు తల్లి జంక్షన్‌లలో రద్దీ ఎక్కువగా ఉంది. సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు మళ్లించారు. అలాగే ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు డైవర్ట్ చేశారు.

రవీంద్రభారతి నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్‌ను దాటకుండా ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద నాంపల్లి వైపు మళ్లించబడ్డాయి. వాహనదారులు పంజాగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అంబేద్కర్ ఫ్లైఓవర్, బషీర్‌బాగ్, అబిడ్స్ సర్కిల్, హైదర్‌గూడ, లిబర్టీ, ఎంజే మార్కెట్ వంటి జంక్షన్‌ల వైపు రాకుండా ఇతర మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Next Story