హైదరాబాద్‌ అబిడ్స్‌లో ప్రమాదం.. పలు వాహనాలు ధ్వంసం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-18 17:00:51  IST  )

హైదరాబాద్‌ పలుచోట్ల కుంభవృష్టి వర్షం కురిసింది....

హైదరాబాద్‌ అబిడ్స్‌లో ప్రమాదం.. పలు వాహనాలు ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad) పలుచోట్ల కుంభవృష్టి వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం(Heavy Rains) బీభత్సం సృష్టించింది. దీంతో భారీ వృక్షాలు, కరెంట్ స్థంభాలు నెలకూలిపోయాయి. పలుచోట్ల రోడ్లపై నీరు భారీగా నిలిచిపోయి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీ పొంగిపొర్లాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించి పోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవించారు. హైదరాబాద్ అబిడ్స్‌లో అయితే పెను ప్రమాదం తప్పింది. రామకృష్ణ థియేటర్‌ ఎదుట ఉన్న భారీ క్రేన్‌ ఒక్కసారిగా కూలిపోయింది. భవన నిర్మాణాల కోసం ఈ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. అయితే వర్షం పడటంతో ఒక్కసారిగా కూలింది. దీంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది.

Next Story