Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-24 13:48:49  IST  )

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది...

Breaking: హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో పలు చోట్ల భారీగా వర్షం(Huge Rain) కురుస్తోంది. లింగంపల్లి, కూకట్ పల్లి, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్టలో వాన పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

Next Story