- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి పొన్నం
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం(Hyderabad Rain) ముంచెత్తింది.

దిశ, వెబ్ డెస్క్ : శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం(Hyderabad Rain) ముంచెత్తింది. నగరంలో అనేక చోట్ల భారీ ఈదురు గాలులు, ఉరుములు(Thunder Stroms), మెరుపులతో కూడిన వర్షానికి పలు చోట్ల చెట్లు నేలకూలి పోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచి పోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లోకి దిగినప్పటికీ.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను తనకు వివరించాలని తెలిపారు.
కూలిన చెట్లను వెంటనే తొలగించి, వీలైనంత తొందరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ప్రజలను హెచ్చరించారు.






