Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం

by Muthe.Rajitha |   (  Updated:2025-07-18 11:03:38  IST  )

రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో భారీ వర్షం కురుస్తోంది.

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad Rains) నగరంలో భారీ వర్షం కురుస్తోంది. అమీర్ పేట , ఖైరతాబాద్, యూసఫ్ గూడ, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, కొత్తపేట, రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన ఈ వర్షం మరో గంటపాటు ఇలాగే కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) పేర్కొంది. అయితే భారీ వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచి, భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. కాగా రానున్న మరో రెండు గంటల్లో రాష్ట్రంలో జగిత్యాల, మెదక్, మంచిర్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, జనగామ, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈనెల 23 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.



Next Story