- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీ పిటిషన్.. విచారణ వాయిదా
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది...

దిశ, వెబ్ డెస్క్: ఓఎంసీ కేసు(OMC Case)లో తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో శ్రీలక్ష్మీ పిటిషన్(Srilakshmi petition) దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు వాదనలు వినిపించారు. సీబీఐ తరఫున పీపీ శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీకి మైనింగ్ లీజు అప్పగించారని తెలిపారు. ఓఎంసీకి లీజు కేటాయించేలా శ్రీలక్ష్మీ చొరవ తీసుకున్నారని చెప్పారు. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి లీజు వచ్చేలా చూశారని వాదించారు. శ్రీలక్ష్మీ అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయని వివరించారు. సాక్ష్యాధారాలు పరిశీలించాకే సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ పీపీ శ్రీనివాస్ కపాటియా హైకోర్టులో వాదనలు వినిపించారు. శ్రీలక్ష్మీ తరపున వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి(రేపటికి) వాయిదా వేశారు.






