- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, శేరిలింగంపల్లి: ఏఐజీ ఆస్పత్రిలో హెడ్‌నర్సుగా పని చేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్ కాకినాడ కచేరిపేటకు చెందిన కుమారి రజని(27) గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో హెడ్ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి కొండాపూర్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యక్తిగత సమస్యల వల్లే రజని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






