IPL Matches: ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. HCA రియాక్షన్ ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-30 11:08:40  IST  )

ఐపీఎల్‌లో కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదంపై హెచ్‌సీఏ స్పందించింది...

IPL Matches:  ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. HCA రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల(IPl Matches) సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటు హైదరాబాద్‌(Hyderabad) ఉప్పల్ స్టేడియంలోనూ కొన్ని మ్యాచ్‌లు జరుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లను చూడాలనుకునే దివ్యాంగుల( Disabled Persons)కు HCA ఉచితంగా కాంప్లిమెంటరీ పాసులు(Free Complimentary Passes) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ టికెట్లు తీసుకునేందుకు పేరు, ఫోన్ నెంబర్, వ్యాలిడ్ డిజబులీ ఫ్రూప్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి వివరాలను [email protected] కు ఈ మెయిల్ చేసి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది.

అయితే ఈ కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో వివాదం(Dispute) నెలకొంది. ఈ పాస్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వేధింపులకు పాల్పడుతోందని సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫాంచైజీ ఆరోపించింది. ఉచిత పాస్‌ల కోసం తమపై తీవ్ర ఒత్తిడి చేస్తోందని ఏసీఏ అసోసియేషన్ కోశాధికారికి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధి లేఖ రాశారు. హెచ్‌సీఏ‌కు కోరినన్ని పాసులు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేశారని తెలిపారు. టికెట్ల వ్యవహారంలో HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు చాలాసార్లు బెదిరించారని, ఇలాగే వేధింపులు కొనసాగితే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించారు. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని లేఖలో కోరారు. దీంతో ఈ వివాదం సంచలనంగా మారింది.

అయితే ఈ వివాదంపై హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం సిబ్బంది స్పందించింది. SRH, HCA మధ్య ఎలాంటి వివాదం లేదని తెలిపింది. హెచ్‌సీఏ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, నకిలీ ఈ మెయిల్స్‌తో దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేసింది.

Next Story