HCA కేసు CBI కి బదిలీ చేయాలి : హైకోర్టులో పిటిషన్

by Muthe.Rajitha |

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

HCA కేసు CBI కి బదిలీ చేయాలి : హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. HCA లో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై సీబీఐ(CBI) విచారణ కోరుతూ సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ తెలంగాణ హైకోర్టు(High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో BCCI, CBI, HCAను ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ జరపనుంది. HCA ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ గాంధీ స్టేడియం నిర్మాణం, కానోపీలు, ఫ్లడ్‌లైట్లు వంటి ఒప్పందాలలో రూ. 2-3 కోట్ల నష్టం వాటిల్లినట్లు CID అధికారులు ఇప్పటికే గుర్తించారు.

అలాగే జగన్ మోహన్ రావు అక్రమ పద్ధతిలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారని కూడా తేల్చింది. అపెక్స్ కౌన్సిల్ విభేదాల వల్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు సమాచారం. వీటన్నిటీ పిటిషన్లో పేర్కొంటూ... రాష్ట్ర స్థాయి దర్యాప్తు సరిపోదని, ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపడానికి సీబీఐ విచారణ అవసరమని సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ పేర్కొంది. ఇప్పటికే హైకోర్టు HCAపై ఆర్థిక ఆంక్షలు విధించగా, ఈడీ రూ. 51.29 లక్షల ఆస్తులను జప్తు చేసింది.

Next Story