Breaking News : భాగ్యలక్ష్మీ టెంపుల్ ఎండోమెంట్ స్వాధీనంపై హైకోర్ట్ స్టే

by Muthe.Rajitha |   (  Updated:2025-02-28 16:21:38  IST  )

భాగ్యలక్ష్మి ఆలయం రోజువారీ కార్యకలాపాలతో సహా ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది.

Breaking News : భాగ్యలక్ష్మీ టెంపుల్ ఎండోమెంట్ స్వాధీనంపై హైకోర్ట్ స్టే
X

దిశ, వెబ్ డెస్క్ : భాగ్యలక్ష్మి ఆలయం రోజువారీ కార్యకలాపాలతో సహా ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది. ఎండోమెంట్ నిర్ణయాలై శశికళా అనే మహిళ పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టుధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ మార్చి 21 కి వాయిదా వేసింది. భాగ్యలక్ష్మీ ఆలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులపై కోర్టు విచారణ అనంతరం ఆలయాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆలయ నిర్వహణ బాధ్యతను మహంత్ మనోహర్ దాసు, మహంత్ రాంచంద్రదాసు 1960 దశకం నుండి చూస్తున్నారు. ఇప్పుడు నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ఆలయానికి తక్షణమే ఈఓను నియమించి ఆలయంలో ఎటువంటి అవకతవకలు లేకుండా ముందుకు వెళ్ళాలని గత రెండు రోజుల క్రితమే దేవాదాయ శాఖ కమిషనర్‌ను ట్రిబ్యునల్ ఆదేశించగా.. తాజాగా ఆ ఉత్తర్వులపై కోర్ట్ స్టే విధించింది.

భాగ్యలక్ష్మీ ఆలయ వివాదం ఏమిటంటే..

1960వ దశకంలో చార్మినార్ వద్దనున్న అమ్మవారి ఆలయ పరిధిలో బస్సు ప్రమాదం జరగడంతో అమ్మవారి విగ్రహం కూలిపోయింది. స్థానిక భక్తులు విరాళాలు సేకరించి అమ్మవారి విగ్రహాన్ని పునర్ ప్రతిష్టించారు. అంతకుముందు పోచమ్మ పేరుతో ఉన్న అమ్మవారి పేరును భాగ్యలక్ష్మీ గా మార్చినట్టు కథనం. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే మహంత్ రాంచంద్ర దాసు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్ మోహన్ దాసు అనే వ్యక్తిని పూజారిగా నియమించారు. టెంపుల్ ట్రస్టీ మీద గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగా హెరిడెటరీ ట్రస్టీ ఆర్డర్స్‌తో ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఆదాయాన్ని రాజ్ మోహన్‌దాసు ఒక్కరే అనుభవిస్తూ వచ్చారు. దీనిపై మహంత్ రాంచంద్ర దాసు కుమార్తె భాగ్యలక్ష్మీ ఆలయం అజామాయిషీ చేస్తున్న వారిపై కోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయాల ఆలయ నిధులను ప్రస్తుత నిర్వహకులు దుర్వినియోగం చేస్తున్నట్టు సాక్షాధారాలను కూడా ట్రిబ్యూనల్ దృష్టికి తీసుకెళ్లడంతో భాగ్యలక్ష్మి ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించాలని తీర్పు ఇచ్చింది.

Next Story