- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు.. వృద్ధుడిపై కేసు నమోదు
పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

X
దిశ ఖైరతాబాద్ : పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 ప్రాంతంలో నివసిస్తున్న 43 ఏళ్ల మహిళ డిజైనర్ దుస్తుల షోరూమ్ నిర్వహిస్తోంది. ఇఫ్తకార్ (60) అనే వ్యక్తి కొంత కాలంగా ఆమె బోటిక్‌కు తరచూ వచ్చి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు ఆరోపించింది. అతని ప్రవర్తనతో విసిగిపోయిన మహిళ ముందుగా షీ టీంను సంప్రదించింది. వారి సూచనల మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇఫ్తకార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






