వాట్సాప్ లో వేధింపులు.. ఇద్ద‌రు నిందితుల‌కు జైలు శిక్ష

by Ratna Kumari |

మహిళలు, బాలికల రక్షణ కోసం హైదరాబాద్ షీ టీమ్స్ చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది.

వాట్సాప్ లో వేధింపులు.. ఇద్ద‌రు నిందితుల‌కు జైలు శిక్ష
X

దిశ, సిటీక్రైం : మహిళలు, బాలికల రక్షణ కోసం హైదరాబాద్ షీ టీమ్స్ చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహిళలను వేధిస్తున్న వారిని వదిలిపెట్టడం లేదు. బాధిత మహిళల ఫిర్యాదుల పై సమర్ధవంతంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోకిరీలకు శిక్షలు పడేలా చేస్తున్నారు. తాజాగా ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ లతో వేధిస్తున్న ఇద్దరు పోకిరీలకు శిక్షలు ఖరార‌య్యేలా చేయడంతో వారికి కోర్టు 2 రోజుల పాటు జైలు శిక్షను వేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కు చెందిన చింతలపల్లి లక్ష్మారెడ్డి(30)హైదరాబాద్ లంగర్ హౌజ్ ప్రాంతానికి చెందిన గడప నరేష్ లు మహిళలను సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ ల ద్వారా వేధిస్తున్నారు.

వీరి టార్చర్ ను భరించలేక బాధిత మహిళలు హైదరాబాద్ షీ-టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. షీ టీమ్స్ పోలీసులు వీరికి కౌన్సిలింగ్ చేసి వార్సింగ్ ఇచ్చినా వీరి ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 292, హైదరాబాద్ సిటీ పోలీసు యాక్ట్ సెక్షన్ 70(సి) పెట్టీ కేసు నమోదు చేసి ఆధారాలతో చార్జీ షీటును దాఖలు చేసి, నిందితులను కోర్టులో హాజరుపర్చారు. విచారించిన ఈ ఇద్దరీకి 2 రోజుల జైలు శిక్షను ఖరారు చేసింది.

Next Story