హైకోర్టులో అభ్యర్థులకు నిరాశ.. యథావిధిగా గ్రూప్‌-2 పరీక్షలు

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో యథావిధిగా గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి...

హైకోర్టులో అభ్యర్థులకు నిరాశ.. యథావిధిగా గ్రూప్‌-2 పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో యథావిధిగా గ్రూప్‌-2 పరీక్షలు(Group-II Examinations) జరగనున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలని కోరిన అభ్యర్థుల(Candidates)కు హైకోర్టు(High Court)లో నిరాశ కలిగింది. గ్రూప్‌-2, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(Staff Selection Commission) పరీక్షలు ఒకేరోజు ఉన్నందున వాయిదా వేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. పరీక్షకు వారం ముందు జోక్యం చేసుకోబోమని కోర్టు పేర్కొంది.

దీంతో ఈ నెల 15, 16న గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు 5 లక్షల 51 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 15న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకూ పేపర్-1, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకూ పేపర్-2, డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12.30 వరకూ పేపర్-3, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకూ పేపర్-4 పరీక్ష జరగనుంది.

Next Story