‘దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి’: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

by Kodari Anjali |

దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

‘దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలి’: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
X

దిశ, హిమాయత్ నగర్: దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. మన అమెరికా తెలుగు అసోసియేషన్ (మాట) రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సహకారంతో గవర్నర్ 100 మంది దృష్టి లోపం ఉన్న పిల్లల కోసం డిజిటల్ గైడ్ డివైజ్‌‌‌ను విడుదల చేసి వారికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో సాధికారత కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ భవన్ కార్యదర్శి ఐఏఎస్ అధికారి దానకిషోర్, గవర్నర్ ఓఎస్డీ భవానీ శంకర్, ప్రొఫెసర్ డా.విజయభాస్కర్, కిరణ్ దుగ్గడి, శ్రీధర్, శేఖర్ 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story