- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND vs NZ Final Match : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. మల్టీప్లెక్స్ లో లైవ్
హైదరాబాద్(Hyderabad) క్రికెట్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) క్రికెట్ ప్రియులకు భారీ గుడ్ న్యూస్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్(ICC Champions Trophy Final Match) ఈ ఆదివారం దుబాయ్ వేదికగా.. టీమిండియా vs న్యూజిలాండ్(India vs Newzealand మధ్య జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ లవర్స్ అందరూ ఆరోజు టీవీలకు అతుక్కుపోతారు. లేదా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మ్యాచ్ చూసేందుకు ఎగబడతారు. అసలే క్రికెట్ అంటే పడి చచ్చిపోయే మన దేశంలో దాదాపు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల పరిస్థితి ఇంతే. అయితే ఆరోజు హాయిగా ఏసీలో కూర్చొని, పాప్ కార్న్ తింటూ మ్యాచ్ చూడాలి అనుకునే వారికోసం మల్టీప్లెక్స్(Multiplex) ఓ మంచి సౌకర్యం కల్పిస్తోంది.
ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ ను నగరంలోని మల్టీప్లెక్స్ ల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటికే బుక్ మై షోలో టికెట్స్(Book My Show) కూడా అందుబాటులోకి వచ్చాయి. మల్టీప్లెక్స్ లు భారత్ మ్యాచ్ లు ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. అదేవిధంగా ఇలాంటి కొత్త అనుభవం కోసం క్రికెట్ ప్రియులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరు కూడా మల్టీప్లెక్స్ లో మ్యాచ్ చూడాలి అనుకుంటే ఎందుకు ఆలస్యం.. బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి.. వెళ్ళి రిజర్వ్ చేసుకోండి మరి.






