‘డయాబెటిస్’ ను ఎదుర్కోవడానికి ప్రపంచ సహకారం అవసరం

by Elthuri vijay kumar |

పెరుగుతున్న డయాబెటిస్ సమస్యల భారాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ సహకారం అవసరమని కజకిస్తాన్ కాన్సుల్ జనరల్ నవాబ్ నాసిర్ అలీఖాన్ అన్నారు.

‘డయాబెటిస్’ ను ఎదుర్కోవడానికి ప్రపంచ సహకారం అవసరం
X

‘డయాబెటిస్’ ను ఎదుర్కోవడానికి ప్రపంచ సహకారం అవసరం

-కజకిస్తాన్ కాన్సుల్ జనరల్ నవాబ్ నాసిర్ అలీఖాన్

దిశ, హిమాయత్ నగర్ : పెరుగుతున్న డయాబెటిస్ సమస్యల భారాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ సహకారం అవసరమని కజకిస్తాన్ కాన్సుల్ జనరల్ నవాబ్ నాసిర్ అలీఖాన్ అన్నారు. సోమవారం డయాబెటిస్ అకాడమీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో “డయాబెటిస్ కాంప్లికేషన్స్ 2025 – క్లినికల్ అప్‌ డేట్” క్లినికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్- 2025 ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, మధుమేహ సంరక్షణలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లినికల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ డా. అమిత్ గుప్తాకు అందచేశారు. ఈ సందర్భంగా డయాబెటిస్ అకాడమీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డా. జయప్రకాష్ సాయి మాట్లాడుతూ డయాబెటిస్ పరిశోధన, విద్య క్లినికల్ ప్రాక్టీస్‌లో రాణించడాన్ని ప్రోత్సహించే లక్ష్యాన్ని డయాబెటిస్ అకాడమీ కొనసాగిస్తుదని తెలిపారు.

Next Story