- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వన మహోత్సవంలో జీహెచ్ఎంసీ సైతం..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవానికి జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కుల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.

దిశ, సిటీ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవానికి జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, సెంట్రల్ మీడియన్స్, ఖాళీ స్థలాలు, కాలనీ పార్కుల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. వీటితోపాటు చెరువులు, చెరువుల బండ్ పైనా, రోడ్ల పక్కన మొక్కలు నాటాలని నిర్ణయించారు. అత్యధికంగా కూకట్ పల్లి జోన్ పరిధిలో 6.25లక్షలు, తర్వాత శేరిలింగంపల్లిలో 6 లక్షలు, ఎల్బీనగర్ 4.53 లక్షలు నాటనున్నారు. ఈ ప్రాంతాల్లో పార్కులు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు చార్మినార్ జోన్ లో 3.24 లక్షలు, సికింద్రాబాద్ 3 లక్షలు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో అతితక్కువగా 2.5లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. వీటికి సంబంధించిన మొక్కలను జీహెచ్ఎంసీ నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. వన మహోత్సవం సందర్భంగా జోన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
జోన్ పేరు మొక్కల సంఖ్య
ఎల్బీనగర్ 4.53లక్షలు
చార్మినార్ 3.24లక్షలు
ఖైరతాబాద్ 2.5లక్షలు
శేరిలింగంపల్లి 6లక్షలు
కూకట్ పల్లి 6.25లక్షలు
సికింద్రాబాద్ 3లక్షలు
మొత్తం 25.52లక్షలు






