- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెగస్సీ వేస్ట్‌పై జీహెచ్ఎంసీ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లెగస్సీ వేస్ట్‌పై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది.

- పాత కార్లను సైతం ఖండం చేయాలని సూచన
దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లెగస్సీ వేస్ట్‌పై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. చాలాకాలంగా వినియోగించకుండా మూలనపడేసిన కార్లు, బైకులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో చెత్త పేరుకుపోతోందని గుర్తించిన జీహెచ్ఎంసీ వాటిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. నెలల తరబడి వినియోగించకుండా ఒక చోట వదిలేసిన కార్లను యార్డుకు తరలించి, అక్కడ వాటిని ఖంఢం చేయాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నది. మెరుగైన శానిటేషన్ కోసం ఇటీవలే జీహెచ్ఎంసీ రెండు దశలుగా నిర్వహించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చాలా రోజుల నుంచి రోడ్లకిరువైపులా, చెట్ల కింద, పార్కుల్లో, మైదానాల్లో, గ్రౌండ్స్‌లో పేరుకుపోయిన వేలాది టన్నుల చెత్తను తరలించే సమయంలో వాడుకుండా మూలనపడేసిన కార్లను అధికారులు గుర్తించారు. వీటిని సైతం తొలగిస్తే చాలా వరకు చెత్త పేరుకుపోయిన, చెత్తకు నిలయంగా మారుతున్న గార్బేజీ పాయింట్లను తగ్గించుకోవచ్చనని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ముందుగా లెగస్సీ వేస్ట్‌పై సర్కిళ్ల వారీగా సర్వే నిర్వహించాలని డిప్యూటీ కమిషనర్లకు శనివారం కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీచేశారు. ప్రతి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాడకుండా రోడ్లకిరువైపులా, చెట్ల కింద, మైదానాల్లో పార్కు చేసిన కార్లను, ఇతర వాహనాలను గుర్తించాలని, బాగా దుమ్మూ, ధూళితో నిండిపోయి, లోపల చెత్తతో నిండిన వాహనాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.
ట్రాఫిక్ విభాగంతో సమన్వయం
వినియోగంలోలేని కార్లు, ఇతరాత్ర వాహనాలను తరలించేందుకు జీహెచ్ఎంసీ వద్ద ప్రత్యేకంగా క్రేన్లు వంటివి లేకపోవటంతో సిటీ ట్రాఫిక్ విభాగంతో సమన్వయం చేసుకొని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నది. సాధారణంగా నగరంలో రద్దీ రోడ్లలో అక్రమంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రత్యేకమైన క్రేన్‌తో తరలిస్తున్న సంగతి తెలిసిందే. వినియోగంలేని కార్లు, ఇతర వంటి వాహనాలను దుండిగల్‌లోని జీహెచ్ఎంసీకి చెందిన ప్లాంట్‌కు తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని జీహెచ్ఎంసీ కోరుతున్నది. ఇందుకు ట్రాఫిక్ విభాగం అధికారులు జీహెచ్ఎంసీకి సహకరిస్తారా? లేదా? చూడాల్సిందే. పాత కార్లను గుర్తించడంతోపాటు అక్కడి నుంచి దుండిగల్ యార్డుకు వాహనాన్ని తరలించినందుకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఆ చార్జీలు చెల్లించిన తర్వాత ఓనరే తన సొంత ఖర్చుతో వాహనాన్ని తిరిగి తీసుకెళ్లేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టనుంది. ఈ రకంగా పార్కింగ్ చేసి వదిలేసిన కార్లను గుర్తించాలని కమిషనర్ ఆదేశించిన నేపథ్యంలో అన్ని సర్కిళ్ల నుంచి మరో వారం రోజుల్లో నివేదికలు వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.






