- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GHMC: ప్యారనగర్ వాసులకు డంపింగ్ యార్డ్ పరేషాన్
జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తను డంప్ చేయడం కష్టంగా మారింది.

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో చెత్తను డంప్ చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ డంపింగ్ యార్డు పూర్తిగా నిండిపోయిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా నాలుగు సైట్లను జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటిలో ప్యారనగర్ డంపింగ్ యార్డు కొలిక్కి వచ్చిందనుకున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఫలితంగా జీహెచ్ఎంసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 8,500 టన్నుల చెత్త..
జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు చెందిన 8,500 టన్నుల చెత్తను సైతం ఇక్కడే డంప్ చేస్తున్నారు. అయితే రోజురోజుకు చెత్త ఉత్పత్తి పెరుగుతుండడంతో డంప్ చేయడానికి జవహార్‌నగర్ డంపింగ్ యార్డులో స్థలం లేకుండాపోయింది. దీంతోపాటు ఈ డంపింగ్ యార్డుపై భారం తగ్గించడానికి నగరానికి నలుదిక్కుల మరో నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
పరేషాన్..
సంగారెడ్డి జిల్లా ప్యారనగర్‌లో డంపింగ్ యార్డు కోసం గుర్తించిన 125 ఎకరాల స్థలంపై స్థానికులు లొల్లి చేస్తున్నారు. ఒక్క జవహార్‌నగర్‌లోని చెత్త డంపింగ్ యార్డు నిండిపోవడం, కొత్త డంపింగ్ యార్డులకు స్థలం లేకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు పరేషాన్‌లో ఉన్నారు. జవహార్‌నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించడానికి మరో నాలుగు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా లక్డారంలో 100 ఎకరాలు, ప్యారనగర్‌లో 125 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని చౌటుప్పల్ మండలంలోని మల్కాపురంలో 200 ఎకరాలు, మేడ్చల్ జిల్లాల్లోని దుండిగల్‌లో 85 ఎకరాలను అధికారులు గుర్తించారు. గతంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట్‌లోనూ 150 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అయితే ఏ ప్రాంతంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేద్దామని అధికారులు ప్రయత్నించిన స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్యారనగర్‌లో మాత్రం కలెక్టర్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు అటవీశాఖ క్లియరెన్స్ కూడా వచ్చింది. కానీ అక్కడ సైతం ప్రజలు, రాజకీయ నాయకుల నుంచి వ్యతిరేకత ఉంది.
పోలీసు పహారాలో..
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటును విరమించే వరకు సెల్ టవర్ దిగమంటూ హెచ్చరించారు. అయితే భారీ బందోబస్తు మధ్య అర్ధరాత్రి డంపింగ్ యార్డు పనులను ప్రారంభించారు. ఈ డంపింగ్ యార్డు ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సీరియస్‌గానే తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో డంపింగ్ యార్డు పనులు వేగంగా చేపట్టాలని నిర్ణయించారు.






