దోపిడీ దొంగల గ్యాంగ్‌ అరెస్ట్..!

by Ratna Kumari |

సికింద్రాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, లాలగూడ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు సభ్యుల గల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

దోపిడీ దొంగల గ్యాంగ్‌ అరెస్ట్..!
X

దిశ, అంబర్ పేట : సికింద్రాబాద్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, లాలగూడ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురు సభ్యుల గల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె. మూర్తి మంగళవారం అంబర్ పేట డీసీపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన‌ విలేకర్ల‌ సమావేశంలో వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, అరిహంత్‌ సదన్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శరత్‌ నరేష్‌ ఇంట్లోకి నిందితులు అక్రమంగా చొరబడి, ఇంట్లో ఉన్న‌ మహిళను బెదిరించి ఆమె పై దాడి చేసి, సుమారు 4.5 లక్షల విలువగల, 28.8 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారని తెలిపారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌ శ్రీ సత్యసాయి జిల్లా గుర్రప్పగారి మహేష్‌ (36), చిన్నకోట్ల పవన్‌కుమార్‌ భవన్న (45), గీజు సురేంద్ర (37) వారీగా గుర్తించారు.

ఈ మేరకు క్రైం నంబర్‌ 17/2026, సెక్షన్‌ 309 BNS కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి 18.15 గ్రాముల బంగారు గొలుసు, 3.15 గ్రాముల ఉంగరం 7.52 గ్రాముల కంకణం తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మహేష్‌ గతంలో అదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేశాడని, ఆ పరిచయంతో అపార్ట్మెంట్ పరిసరాల పరిస్థితులపై క్షుణ్ణమైన అవగాహన ఉండటంతో దొంగతనానికి పథకం వేసినట్లు వెల్లడైందని తెలిపారు. అతడు తన స్నేహితులతో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడని డీసీపీ చెప్పారు. ముగ్గురి నిందుతులని మంగళవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ డీసీపీ సికింద్రాబాద్‌ జోన్‌ రక్షిత కె. మూర్తి, పర్యవేక్షణలో విజయవంతంగా సాగిందని పోలి్స్ లు పేర్కొన్నారు. ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ నరసయ్య పాల్గొన్నారు

Next Story