గచ్చిబౌలి హెచ్ సీయూ సెకండ్ గేట్ వద్ద రోడ్డు యాక్సిడెంట్, ఒకరు మృతి

by Bhanu |

దారివెంట చెట్లకు నీళ్లు పట్టేందుకు సిద్దమవుతున్న జీహెసీఎంసీ కాంట్రాక్ట్ లేబర్ పైకి కారు దూసుకు వెళ్లడంతో రోజువారి కూలీ అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర ఘటన మంగళవారం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గచ్చిబౌలి హెచ్ సీయూ సెకండ్ గేట్ వద్ద రోడ్డు యాక్సిడెంట్, ఒకరు మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : దారివెంట చెట్లకు నీళ్లు పట్టేందుకు సిద్దమవుతున్న జీహెసీఎంసీ కాంట్రాక్ట్ లేబర్ పైకి కారు దూసుకు వెళ్లడంతో రోజువారి కూలీ అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర ఘటన మంగళవారం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబా బాద్ జిల్లాకు చెందిన పవార్ (50) కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వలసవచ్చి జీవనం సాగిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా జీహెసీఎంసీ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.

పనిలో భాగంగా పవార్ మంగళవారం గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ) సెకండ్ గేట్ సమీపంలో దారివెంట మొక్కలకు నీళ్లు పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా వాటర్ ట్యాంకర్ కు ఉన్న పైప్ తీస్తుండగా.. వాటర్ ట్యాంకర్ కు కొద్దిదూరంలో ఆగి ఉన్న కారు ( కేఏ 05 ఎండబ్ల్యూ 5720)కు హ్యాండ్ బ్రేక్ వేయకుండా అందులోని వారు కిందికి దిగి పండ్లు కొనేందుకు వెళ్లారు. దీంతో కారు వాటర్ ట్యాంకర్ పైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో కారుకు, వాటర్ ట్యాంకర్ కు మధ్య చిక్కుకున్న పవార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన పవార్ ను అక్కడే పనిచేస్తున్న వారు బయటకు తీసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story